ఐఫోన్ కొట్టేసి సెల్ఫీ తీసుకున్న కోతి: ఇప్పుడది సెలబ్రిటీ!
బర్మింగ్‌హామ్: మనుషులే కాదు తాము కూడా సెల్ఫీలు తీసుకోగలమని నిరూపించింది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన ఓ కోతి. సదరు కోతి ఓ టూరిస్ట్ చేతిలోని ఐఫోన్ లాక్కుని సెల్ఫీ దిగడం గమనార్హం. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని జూలో చోటుచేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. రెబెక్కా అనే యువతి ఆ జూకి వెళ్లింది. అక్కడవున్న కాపుచిన్ జాతికి చెందిన రొమాని అనే కోతిని రెబెక్కా ఫొటో తీయాలనుకుంది. ఇంతలో రొమాని ఫెన్సింగ్ వద్దకు వచ్చి రెబెక్కా ఫోన్‌లాక్కొని చక్కగా సెల్ఫీ దిగింది. దీంతో అక్కడున్న పర్యాటకులంతా అవాక్కయ్యారు.
No comments:
Post a Comment